Thama Devuneruguvaaru
తమ దేవునెరుగువారు చేసెదరు
శక్తితో గొప్ప కార్యములు (2)
ఇచ్చకపు మాటల వలన – అక్షయుని విడువరు (2)
తప్పుబోధల నెప్పుడు తృణీకరించెదరు (2) ||తమ||
సత్యమును విడువరు – ఉత్తములుగా నడిచెదరు (2)
అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు (2) ||తమ||
మనుజ భయము జెందరు – మాన్యులై యుండెదరు (2)
మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు (2) ||తమ||
ద్వేషించెదరు విగ్రహముల్ – శిరములు ఖండించినను (2)
పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు (2) ||తమ||
అగ్నిలో వేయబడినను – విఘ్నంబులు కలిగినను (2)
సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు (2) ||తమ||
శోధనలను జయించెదరు – బాధలను సహించెదరు (2)
నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు (2) ||తమ||
అదిక జ్ఞానమును పొంది – తగ్గించుకొనెదరు తామే (2)
యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు (2) ||తమ||
Thama Devuneruguvaaru Chesedaru
Shakthitho Goppa Kaaryamulu (2)
Ichchakapu Maatala Valana – Akshayuni Viduvaru (2)
Thappu Bodhala Neppudu Thruneekarinchedaru (2) ||Thama||
Sathyamunu Viduvaru – Utthamulugaa Nadichedaru (2)
Athalyaanu Hathamu Chesedaru Shuddhulai Yundedaru (2) ||Thama||
Manuja Bhayamu Jendaru – Maanyulai Yundedaru (2)
Manchi Saakshamunu Viduvaru Ekaanthulu Kaaru (2) ||Thama||
Dweshinchedaru Vigrahamul – Shiramulu Khandinchinanu (2)
Parvathamuvale Kadalaka Vaaru Sthiramuga Nundedaru (2) ||Thama||
Agnilo Veyabadinanu – Vighnambulu Kaliginanu (2)
Simhapu Bonulo Vesinanu Siggunondaru (2) ||Thama||
Shodhanalanu Jayinchedaru – Baadhalanu Sahinchedaru (2)
Naathudeesuni Sadaa Vedaki Saadhinchi Prakatinthuru (2) ||Thama||
Adhika Gnaanamunu Pondi – Thagginchukonedaru Thaame (2)
Yesu Prabhuvunu Hechchinchedaru Hallelujah Paadedaru (2) ||Thama||
Chords not available.